తెలుగుతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం, పండ్ల పంపిణీ
పుంగనూరు మేజర్ న్యూస్:
మాజీమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాగానిపల్లె, పాలెంపల్లె పంచాయతీ వైఎస్ఆర్ సీపీ యూత్ ఆధ్వర్యంలో తెలుగుతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం, బ్రెడ్, పండ్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి కృప కటాక్షాలతో పెద్దిరెడ్డి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి, సిద్ధారెడ్డి, యుగంధర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నటరాజ్ యాదవ్, నాగేంద్ర రెడ్డి, మహేంద్ర రెడ్డి, విజయ్ కుమార్, నారాయణ, ప్రేమ్ కుమార్ నాయక్, శరత్ కుమార్ రెడ్డి, శ్రీరాములు రెడ్డి పాల్గొన్నారు.
రిపోర్టర్: రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా