BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

తెలుగు భాషా వికాసంలో చైతన్యరాజుకు జీవిత సాఫల్య పురస్కారం..

Select Suryaa Now
తెలుగు భాషా వికాసంలో చైతన్యరాజుకు జీవిత సాఫల్య పురస్కారం..

అమలాపురం, మేజర్ న్యూస్ :వైద్య, విద్యా,సామాజిక సేవా రంగాలతోపాటు తెలుగు భాషా వికాసానికి విశేష సేవలందిస్తున్న గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీ కులపతి,  కిమ్స్‌ వైద్య కళాశాల అధినేత, చైతన్య గ్రూప్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ కె.వి.వి. సత్యనారాయణరాజు చైతన్యరాజుకు అమెరికాలోని డల్లాస్‌ అడాప్ట్‌ ఏ విలేజ్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్ఠాత్మక జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది.

వైద్య విద్యాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణలో చైతన్యరాజు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మూడు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కోవిడ్‌ సమయంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా నిలిచారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

పూర్వ శాసనమండలి సభ్యుడిగా, ప్రభుత్వ విప్‌గా, ఈబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కూడా ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు. వైద్య, విద్యా, భాషా, సామాజిక రంగాల్లో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.తనకు ప్రతిష్ఠాత్మక జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించిన అడాప్ట్‌ ఏ విలేజ్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ కమిటీ సభ్యులకు, భూపతిరాజు పండిత్‌కు చైతన్యరాజు కృతజ్ఞతలు తెలిపారు.