BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

తక్కువ ధరకే ప్రజలకు నాణ్యమైన ధరణి బియ్యం : 26 కిలోల బస్తా రూ.1,300లు : మదనపల్లి రైతుబజారులో సరఫరా

Select Suryaa Now
తక్కువ ధరకే ప్రజలకు నాణ్యమైన ధరణి బియ్యం : 26 కిలోల బస్తా రూ.1,300లు : మదనపల్లి రైతుబజారులో సరఫరా

మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలతో సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ధరణి బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.పౌరసరఫరాల శాఖ నుంచి నాణ్యమైన సన్నరకం ధరణి బియ్యం కిలో రూ.50 రూపాయలు చొప్పున 26 కిలోల బస్తాలను రూ.1,300లకే అందిస్తున్నారు.మదనపల్లె పట్టణంలోని స్థానిక రైతు బజారులో ఈ బియ్యం సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు క్రాంతి,వెంకటేష్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డులో ఏదో ఒకటి రైతుబజారుకు తీసుకెళితే 26 కిలోల ప్యాకెట్ ను ఇస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం రైతు బజారులో బియ్యం స్టాకు అవసరమైన మేర ఉందన్నారు.నాణ్యమైన సన్నరకం బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నట్లు తెలిపారు.అక్టోబర్ 14వ తేది నుంచి ప్రభుత్వం ధరణి బియ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు.ఇప్పటివరకు మదనపల్లిలో 3,000 ప్యాకెట్లు అమ్ముడయ్యాయని వివరించారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సాయంత్రం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు రైతు బజార్లో ధరణి బియ్యం సరఫరా చేస్తున్నామని,అవసరమైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అదేవిధంగా ఎర్రగడ్డలను సైతం కిలో రూ.35కే విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి