BREAKING
నారాయణపేటలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నేటి రాశి ఫలాలు – 15 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 15 అక్టోబర్ 2026 మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ను పరామర్శించిన వైయస్సార్సీపీ వడ్డీ రఘురాం బాలికలు శక్తివంతంగా తయారు కావాలి -- నారాయణపేట సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ టిడిపిలో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత- ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల వినూత్న నిరసన -- బోడెమ్మలు వేసి బతుకమ్మకు వినతిపత్రం అందించిన మహిళలు -- నారాయణపేటలో 2వ రోజు కొనసాగిన సమ్మె జంగారెడ్డిగూడెం వార్డుల రిజర్వేషన్లు - కమిషనర్ కేవీ. రమణ పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన హింసాత్మక, అస్తవ్యస్త సమాజానికి బౌద్ధ ధర్మమే శరణ్యం బేతాళ సుదర్శన్ చండీదేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పరిశుభ్రమైన జంగారెడ్డిగూడెం మా లక్ష్యం - ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమన్వయంతోనే పల్లెల ప్రగతి.. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కూడా మహిళలదే హవా .. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయం సాధించాలి, కంభం విజయరాజు, జెట్టి

తహసీల్దార్ కందుల కుశరాజుకు వినతి పత్రం అందించిన రేషన్ డీలర్లు

Select Suryaa Now
తహసీల్దార్ కందుల కుశరాజుకు వినతి పత్రం అందించిన రేషన్ డీలర్లు

ఆలమూరు మేజర్ న్యూస్ :రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కొత్తగా తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం మండల రేషన్ డీలర్ల అధ్యక్షులు ఎస్ గోపాలకృష్ణ, కె జయరాజు, కె శివకుమార్ ఆధ్వర్యంలో వారంతా తహసీల్దార్‌ కందుల కుశరాజుకు ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. 

ప్రధానంగా రేషన్ డీలర్ల కమిషన్‌ను ప్రస్తుతమున్న కిలోకు రూ.1 నుంచి రూ.3కు పెంచాలని వారు కోరారు. క్యూఆర్ కోడ్ విధానంతో డీలర్లపై ఆర్థిక, పనిభారం పెరిగి రేషన్ పంపిణీ ఆలస్యమవుతోందన్నారు. ముఖ్యంగా ఈ విధానం వల్ల మహిళా డీలర్లు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రేషన్ షాపులకు సివిల్ కేసుల కారణంగా బియ్యం సరఫరా నిలిచిపోవడం, నామినీలకు సంబంధించిన ఆథరైజేషన్లు పెండింగ్‌లో ఉండటం వంటి సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. 

వీటితో పాటు రేషన్ షాపులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. హెల్త్ కార్డుల స్థానంలో  ఇ ఎస్ ఐ సౌకర్యంతో కూడిన వైద్య సదుపాయం కల్పించాలని, నెల, నెలా గౌరవ వేతనం అందజేయాలని కోరారు.