స్వచ్ఛ తిరుపతి సాధన దిశగా వడివడిగా పడుతున్నా అడుగులు
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ . స్వచ్ఛతిరుపతి' సాధన దిశగా వడివడిగా పడుతున్న అడుగులు.
స్వచ్చ తిరుపతి సాధన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ సూచనల మేరకు అధికారులు, సిబ్బంది నగరంలోని 102 వార్డు సచివాలయాల్లో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ పర్యవేక్షణలో శనివారం ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు.
కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే నగరపాలక సంస్థ కార్యాలయం పరిసరాలతో పాటు, మిద్దపైన కూడా తనిఖీ చేసి ముందు మన కార్యాలయం నుండి పారిశుధ్య చర్యలు చేపట్టాలని, మార్పు మన నుండే ప్రారంభం కావాలని ఆదేశించి ఆచరించారు.
నగరంలోని అన్ని వార్డు సచివాలయాలను శుభ్రంగా ఉంచుకోవడం వలన ప్రజలకు పారిశుధ్యం పై చక్కని అవగాహన కల్పించినట్లు అవుతుందని సిబ్బందికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే శనివారం నగరంలోని అన్ని సచివాలయాల్లో యుద్ధప్రాతిపదిక పారిశుధ్య పనులు చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది, ముఖ్యంగా శానిటేషన్ సెక్రటరీలు ప్రధాన బాధ్యత తీసుకొని పారిశుధ్య కార్మికులతో సమన్వయం చేసుకుంటూ పారిశుధ్య పనులను వేగవంతంగా నిర్వహించారు.
సచివాలయాలు, పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా చూడటం, చెత్తను సక్రమంగా సేకరించి తరలించడం, మురుగు నిల్వలు లేకుండా చూడటం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం, పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించండం వంటి చర్యలను ప్రాధాన్యతతో చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.
తిరుపతి నగరం పవిత్రతను, ప్రతిష్ఠను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. నగర పరిశుభ్రత కోసం ప్రతి అధికారి, ఉద్యోగి సమన్వయంతో, అంకితభావంతో, నిజాయితీతో పనిచేయాలని, స్వచ్ఛ తిరుపతి లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మన ఊరు స్వచ్ఛ తిరుపతి గా మారాలంటే ప్రజలందరూ మన ఇల్లు, మన పరిసరాలు, మన నగరం పరిశుభ్రంగా ఉంచుకుందాం అనే నినాదంతో పారిశుధ్య కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పారిశుధ్య కార్యక్రమాలు కేవలం ఒకరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలని, ప్రతి వార్డు సచివాలయం, పరిసరాల పరిశుభ్రతకు సంబంధిత సిబ్బంది బాధ్యత వహించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టి, నగర ప్రజలకు ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలని కమిషనర్ సూచించారు.
స్వచ్ఛమైన తిరుపతి – ఆరోగ్యకరమైన తిరుపతి లక్ష్యంగా నగరపాలక సంస్థ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. కే రాజేష్, తిరుపతి రిపోర్ట్.