స్థాయి లఘు చిత్రాల పోటీలు
బాలిక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీలు... అంతర్జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీ నిర్వహణ జరిగింది. శుక్రవారం శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో కదిరికి చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో జరిగిన లఘు చిత్రాల పోటీలలో కదిరి, హిందూపురం, మడకశిర, బుక్కపట్నం డిగ్రీ కళాశాలలో చెందిన విద్యార్థిని విద్యార్థులు లఘు చిత్రాలను ప్రదర్శించారు. బాలికల హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవం, సాధికారత, లింగ సమానత్వం పై అవగాహన కల్పించే ఉద్దేశంతో పోటీలు నిర్వహించినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఫైరోజా బేగం పేర్కొన్నారు. ఈ పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కదిరికి చెందిన భాష అనే విద్యార్థికి 30,000, హిందూపురం కు చెందిన గౌతమి ద్వితీయ బహుమతి పొందగా ఆ విద్యార్థికి 20,000, మడకశిర కు చెందిన రజియా తృతీయ బహుమతి ద్వారా పదివేల నగదు సహాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చెక్కుల ద్వారా వారికి అందజేశారు.