గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.
సూర్య న్యూస్ అద్దంకి.
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు అద్దంకి శాఖ గ్రంథాలయం వద్ద వివిధ కార్యక్రమాలు జరుగుతాయని గ్రంథపాలకురాలు వసుంధర దేవి తెలిపారు. నూతన భవన గ్రంథాలయ ఉద్యమకారులు, సాహిత్యాభిమానులచే కార్యక్రమాల బ్రోచర్ ఆవిష్కరించారు..వారోత్సవాల కార్యక్రమ ఆర్గనైజర్ అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ.. రాష్ట్ర గ్రంథాలయ శాఖ ప్రణాళిక ప్రకారం... స్థానిక వివిధ పాఠశాలలోని బాల బాలికలు, పుస్తక పఠన ప్రియులు చే కార్యక్రమాలు జరుగుతాయని త్రిమూర్తులు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో, గ్రీన్ కో సంస్థ సహకారంతో కోటి రూపాయల పైన సి ఎస్ ఆర్ నిధులతో త్వరలో అద్దంకి పట్టణంలో నూతన గ్రంథాలయ భవనo నకు శంకుస్థాపన జరగనున్నదని, ఈసారి గ్రంథాలయ వారోత్సవాలు నూతన భవనంలో జరుపుకుంటామని త్రిమూర్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, డాక్టర్ యు దేవ పాలన, మాజీ అద్దంకి శాఖ లైబ్రరీరియన్ సిహెచ్ సుగుణ రావు, గాడేపల్లి దివాకర్ దత్, చెన్నుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.