భక్తిశ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు.
సూర్య న్యూస్ అద్దంకి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అద్దంకి మండలం సింగరకొండలో నాగుల చవితి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. ఈ పవిత్ర వేడుకల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చారు. క్షేత్రంలోని పుట్ట వద్ద భక్తులు బారులు తీరారు. నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాలు పోసి, పసుపు-కుంకుమలు, పూలతో నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ప్రమిదలు వెలిగించి పూజలు చేయడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.