స్పీకర్ సూచించిన అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పనిచేయాలి
మాకవరపాలెం, నవంబర్ 16,మేజర్ న్యూస్:
పంచాయతీ ఎన్నికల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించిన అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మాకవరపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు ఆర్వై.పాత్రుడు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో టీడీపీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా శెట్టిపాలెం నుంచి అల్లు వెంకటవేణి, బీబీపాలెం నుంచి రుత్తల వీరరత్నం, తామరం నుంచి సన్యాసినాయుడు, మల్లవరం నుంచి వరలక్ష్మి, ముషిడిపాలెం నుంచి రుత్తల రమణమ్మ, బీఎస్‌పేట నుంచి ఈశ్వరమ్మ, రాచపల్లి నుంచి రుత్తల సోమన్నమ్మ, చామంతిపురం నుంచి ఎర్రయ్యమ్మ, అప్పలదొరపాలెం నుంచి సత్యవతి, తాడపాల నుంచి సత్యవతి, పీపీ అగ్రహారం నుంచి గొంతు పోతురాజు, బయ్యవరం నుంచి లాలం మురళీ, గిడుతూరి నుంచి చిటికెల చిట్టితల్లి, లచ్చన్నపాలెం నుంచి రాంబాబు, రామన్నపాలెం నుంచి ఏకా రాజులమ్మ, వెంకటాపురం నుంచి గంగాధర్, కోడూరు నుంచి జగన్నాధం, పైడిపాల నుంచి సిద్ధాబత్తుల రమణ, వజ్రగడ నుంచి తమరాన సత్యవేణి, మామిడిపాలెం నుంచి రాజ్యలక్ష్మి, బూరుగుపాలెం నుంచి సరోజిని, తూటిపాల నుంచి వబ్బలరెడ్డి వెంకటరమణ, కే.తూటిపాల నుంచి గవిరెడ్డి నూకరాజు, జంగాపల్లి నుంచి దేముడు, మాకవరపాలెం నుంచి లాలం రాము, పెద్దిపాలెం నుంచి పైల సత్యవతిని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించినట్లు ఆర్వై.పాత్రుడు వెల్లడించారు.
*గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవాలకు సహకరించాలి: *
మాకవరపాలెం: గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ పంచాయతీ ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించాలని జడ్పీటీసీ అల్లు రామనాయుడు కోరారు. గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పుతూ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని సూచించారు. వైసీపీ నాయకులు సైతం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రధాన లక్ష్యంగా పార్టీలకతీతంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రిపోర్టర్
ఎ . ఎ.నాయుడు