BREAKING
పేదల జీవితాల్లో ఆసరా పెన్షన్ - లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూర్య 'సీన్' బాక్సాఫీస్ జోరు.. పది రోజుల్లోనే రూ.136.50 కోట్లు దాటి రికార్డు! దుర్గారావు పరామర్శించిన జక్కంపూడి దేశంలో పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం అంగన్వాడి సెంటర్స్ లో పిల్లలకు,ప్లేట్స్ గ్లాసుల పంపిణీ  విడాకులకు ముందు కమల్, సారిక మధ్య ఎంతో లోతైన ప్రేమ ఉండేది.. శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత వాయుసేన అమ్ములపొదిలోకి దేశీయ తేజస్ మార్క్-1ఏ చెరువులు కుంటలలో మరమ్మత్తు పనులు చేపట్టాలి బిఆర్‌టి నగర్ 8వ వార్డు అభ్యర్థిగా దొడ్డి నరేంద్ర నామినేషన్. అనకాపల్లి, నవంబర్ 16, మేజర్ బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర ప్రతి పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం

గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు.

Select Suryaa Now
గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళులు.

సూర్య న్యూస్ అద్దంకి.

గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం అద్దంకి శాఖ గ్రంథాలయం వద్ద మూడవరోజు వారోత్సవాలు ఘనంగా జరిగాయి. భారతదేశ చరిత్రలో గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు ఎస్సార్ రంగనాథన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల సర్వోత్తమరావు చిత్రపటాలకు పూలమాలతో నివాళులు అర్పించారు. గ్రంథాలయ వారోత్సవాల ప్రోగ్రాం ఆర్గనైజర్ మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ.. విలువలు గల సమాజం విద్య ద్వారానే సాధ్యమవుతుందని, మన బిడ్డలు లక్ష్యం చేరు కోవాలన్నా, పిల్లలు తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలన్న, సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలన్న, సమాజంలోని రుగ్మతలను పారద్రోలాలన్నా... పుస్తక పఠనంతో కూడిన చైతన్యమే ఏకైక మార్గమని అన్నారు. కార్యక్రమంలో లైబ్రరియన్ సిహెచ్ వి ఎల్ వసుంధర దేవి, దివాకర్ దత్తు, డాక్టర్ యు దేవపాలన, జ్యోతి చంద్రమౌళి, సిహెచ్ సుగుణ రావు, శశిధర్, రవీంద్ర భారతి స్కూల్ హెచ్ ఎం ఎల్ వి మోహన్ రావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.