చెరువులు కుంటలలో మరమ్మత్తు పనులు చేపట్టాలి
శ్రీ సత్య సాయి జిల్లాలోని చెరువులు, కుంటలు, కాలువలలో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా, భూగర్భజల మట్టాలను నిరంతరం పెంచడమే లక్ష్యంగా నిరంతర ప్రక్రియగా చేపట్టాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలన్నారు.