దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం.. యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-అనంతపురం నగర మేయర్‌గా గెలుపొందిన రమేష్ గౌడ్ దుబాయ్‌కు విచ్చేసిన సందర్భంగా యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి, ఆత్మీయ సమ్మేళనం మరియు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి , శ్రీ రామ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ ఆత్మీయ సమ్మేళనం మరియు సన్మాన కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి, శ్రీ రామ్, బీరం సుదాకర్ రెడ్డి,రెడ్డయ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిలాన్ బాషా, తరపట్ల మోహన్, జహీర్, కోటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సోమశేఖర్, వేండ్ర శ్రీనివాస్,విజయ భాస్కర్, ఫహీం, హనుమంతు రెడ్డి, అబ్దుల్లా, వేంకట రమణా రెడ్డి, మనోహర్, నరేష్ చౌదరి, అక్రమ్, చక్రి, సుధాకర్ రెడ్డి, ఖలీల్, శ్రాజా రెడ్డి, సురేష్ , తారక్, భరత్,గణపతి రాజు, పృథ్వీ ,తదితరులు పాల్గొన్నారు.దుబాయ్‌లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతను, పరస్పర స్నేహభావాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ కి నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్