BREAKING
ఉక్రెయిన్‌లో పెరిగిన అణు ప్రమాద ముప్పు సామూహిక సెలవు కోరిన పంచాయతీ కార్యదర్శులు హంగేరీలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు ప్రచారంలో జోరు పెంచిన సర్పంచ్ అభ్యర్థి బుల్లి రెడ్డి. గాంబియా అధ్యక్ష ఎన్నికల బరిలో అడామా బారో ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం - గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న మేయర్ దంపతులు మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గుమ్మాల్లపాడు లో కూటమి పొత్తు బీటలు వారేనా? యూనివర్సిటీ అంతర్ కళాశాల చెస్ టోర్నమెంట్ విజేత యస్ వి కళాశాల శివోహం కూచిపూడి మహాబృంద నాట్య ప్రదర్శనలో ఖండవల్లి విద్యార్థినిలు అర్హులైన పేదలందరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం మంత్రి వివేక్ వెంకటస్వామి బాదంపల్లిలో వివో భవన నిర్మాణానికి భూమి పూజ వాలీబాల్‌లో లక్షెట్టిపేట విద్యార్థిని ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీనిత్య ఎంపిక ! గ్రంథాలయం అనే పునాదిపై విద్యార్థుల భవిష్యత్తును నిర్మించుకోవాలి *డాక్టర్ సలాది శ్రీ రాజేశ్వరి నన్ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ వెనక్కి తగ్గలేదు.. దిల్జీత్ దోసాంజ్ సంచలన వ్యాఖ్యలు!

పేదల జీవితాల్లో ఆసరా పెన్షన్ - లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Select Suryaa Now
పేదల జీవితాల్లో ఆసరా పెన్షన్ - లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
సూర్య.నేరడిగొండ : నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు కొండంత అండగా నిలుస్తాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 490 మంది నూతన లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్  అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్లు ఆర్థిక భరోసాను ఇస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా అందించడమే తన ధ్యేయమని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్ , గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య  అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు  లబ్ధిదారులు  పాల్గొన్నారు.