telangana
అంగన్వాడి సెంటర్స్ లో పిల్లలకు,ప్లేట్స్ గ్లాసుల పంపిణీ
సూర్య చొప్పదండి : చొప్పదండి లయన్స్ క్లబ్ ఎడ్యూకేషనల్ ట్రస్టు అద్వర్యంలో పట్టణం లోని అన్ని అంగన్వాడి సెంటర్స్ లో పిల్లలకు ప్లేట్స్, గ్లాసుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోర భద్రేశం, మున్సిపల్ చైర్మేన్ వడ్లూరి సరిత శ్రీనివాస్. మున్సిపల్ వైస్ చైర్మన్ పెరుమండ్ల మానస గంగయ్య పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సమస్యలను తెలుసుకొని లయన్స్ క్లబ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు మంచికార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అభినందించారు.ఎడ్యూకేషనల్ ట్రస్టు అద్యక్షులు తొడుపునూరి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలాంటి అవసరమున్న మాకు చెప్పాలని అన్నారు. డిస్ట్రిక్ట్ క్యాబినేట్ సెక్రటరీ, వల్లాల క్రిష్ణహరి, డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ కొల్లూరి అనందం మాట్లుడుతూ…మంచి కార్యక్రమాలను చేస్తున్న ఎడ్యూకేషనల్ ట్రస్టును అభినందించారు.
ఈ కార్యక్రమలో లయన్స్ క్లబ్ అద్యక్షులు వల్లాల జగన్, ఎడ్యుకేషన్ ట్రస్ట్ సెక్రెటరీ మామిడి రాజేష్ పవర్, ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోశాధికారి కోడూరి కృష్ణమూర్తి మైక్రో మెంబర్స్ కొల్లూరి జితేందర్, చింతల రవి తోడుపునూరి సత్యనారాయణ పెద్దిలక్ష్మికాంతం, కౌన్సిలర్స్ పిట్టల వెంకటేష్ కొట్టే సునీత అశోక్,చిల్ల అర్చన శ్రవణ్ వడ్లూరి అనూష శ్యాంసుందర్ ఒగులోతుల సురేష్ ,ముద్దం తిరుపతి,అంగన్వాడి సూపర్వైజర్, సెంటర్ ఇన్చార్జ్ సుధారాణి ,నర్సింగారాణి తదితరులు పాల్గొన్నారు.