ప్రతి పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది
సూర్య- బిక్కనూర్ : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. సోమవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనూతన చేయూత పింఛన్ల పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సామజిక భద్రతతో పాటు ఆర్ధిక భరోసా కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి భరోసా ప్రతి ఇంత సంతోషం ఇదే ప్రజా పాలన సంకల్పం అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు ఇంద్రకరణ్ రెడ్డి, అనంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భీంరెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, సుతారి రమేష్, మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, సందీప్, బాగారెడ్డి, సుదర్శన్, భూమాగౌడ్, ఆశబోయిన శ్రీనివాస్, సిరాజ్, నాగరాజు, రాజబాబు గౌడ్, కధీర్, తతిదారులు పాల్గొన్నారు.మహిళలు, నాయకులు పాల్గొన్నారు.