భోగలింగేశ్వర దేవస్థానంలో నాగ జగదీష్‌కు సత్కారం.
అనకాపల్లి, నవంబర్ 16, మేజర్ న్యూస్: పట్టణంలోని శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవ సందర్భంగా మొదటి సోమవారం స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో అర్చక స్వాములు నిర్వహించిన పూజ అనంతరం ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాలకమండలి చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ నాగ జగదీష్‌ను శాలువాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. వేకువజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, ప్రాకార సేవ, ఊంజల సేవ నిర్వహించారు. బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్, అనకాపల్లి వారి సహకారంతో భక్తులకు ప్రసాద కొమ్ము సెనగల వితరణను నాగ జగదీష్ ప్రారంభించారు. కార్తీక మాసం మొదటి సోమవారం స్వామివారికి ప్రాకార సేవ, సాయంత్రం ఊంజల సేవ కార్యక్రమాలు జరుగుతాయని దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి. మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు యలమంచిలి బంగారు రాజు, పెంటకోట అనూష గణేష్, మల్ల సూరిబాబు, కాండ్రేగుల హరికృష్ణ, ఎక్స్ అఫీషియో మెంబర్ మరియు అర్చకులు చిన్నస్వామి, పేరూరి నారాయణరావు, పేరూరి బుజ్జి, పేరూరి సాత్విక్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :నాగు యన్నంశెట్టి, అనకాపల్లి.