నేడు చేయూత పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలో నూతనంగా మంజూరైన 86 చేయూత పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను నేడు (మంగళవారం)పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో జయరాం నాయక్ సోమవారం తెలిపారు.మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.మండలంలో నూతనంగా మంజూరైన పింఛన్లలో దివ్యాంగులు 194,వితంతువులు 558,కల్లుగీత కార్మికులు 38,ఒంటరి మహిళలు 71మంది ఉన్నారని తెలిపారు.మొత్తం 861 మంది లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరుకావాలని ఎంపీడీవో అన్నారు.