BREAKING
పేదల జీవితాల్లో ఆసరా పెన్షన్ - లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూర్య 'సీన్' బాక్సాఫీస్ జోరు.. పది రోజుల్లోనే రూ.136.50 కోట్లు దాటి రికార్డు! దుర్గారావు పరామర్శించిన జక్కంపూడి దేశంలో పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం అంగన్వాడి సెంటర్స్ లో పిల్లలకు,ప్లేట్స్ గ్లాసుల పంపిణీ  విడాకులకు ముందు కమల్, సారిక మధ్య ఎంతో లోతైన ప్రేమ ఉండేది.. శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత వాయుసేన అమ్ములపొదిలోకి దేశీయ తేజస్ మార్క్-1ఏ చెరువులు కుంటలలో మరమ్మత్తు పనులు చేపట్టాలి బిఆర్‌టి నగర్ 8వ వార్డు అభ్యర్థిగా దొడ్డి నరేంద్ర నామినేషన్. అనకాపల్లి, నవంబర్ 16, మేజర్ బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర ప్రతి పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం

భూభారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి - తహశీల్దార్ సాయి భుజంగరావు

Select Suryaa Now
భూభారతి భూ సర్వేకు రైతులు సహకరించాలి - తహశీల్దార్ సాయి భుజంగరావు
సూర్య, నిజాంసాగర్ : భూభారతి భూ సర్వే రీ సర్వే  పథకంలో భాగంగా చేపట్టనున్న భూముల రీ సర్వేకు రైతులందరూ సహకరించాలని నిజాంసాగర్ తహశీల్దార్ సాయి భుజంగరావు రైతులను కోరారు. సోమవారం మండలంలోని మంగ్లూర్, నర్సింగ్‌రావుపల్లి గ్రామాల్లో భూభారతి భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ తొలుత సర్వే అధికారులు గ్రామాల సరిహద్దులను గుర్తిస్తారని తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం ప్రతి రైతుకు ప్రత్యేక నంబర్ కేటాయిస్తారని, భవిష్యత్తులో ఈ నంబర్ల ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వివరించారు.
గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తయిన తర్వాత ఏవైనా మిగులు భూములు ఉంటే గ్రామసభలు నిర్వహించి, అర్హులైన రైతులకు వాటిని అందజేస్తామని పేర్కొన్నారు. భూముల వివరాల నమోదు, సరిహద్దుల నిర్ధారణలో రైతులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో కామారెడ్డి జిల్లా డీఐ రాజేశం, సర్పంచులు రాజు, అంజలీ దేవి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మహేష్ చంద్ర, సర్వేయర్ శ్రీకాంత్, జీపీవోలు దిలీప్ కుమార్, ఎండీ ఖాజ, పిట్లం అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అర్జున్ రావు, ఫారెస్ట్ బీట్ అధికారి గయాజ్, నీటిపారుదల శాఖ అధికారులు, నాయకులు అజయ్ రెడ్డి, అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ ఆగమయ్య, లైసెన్స్‌డ్ సర్వేయర్ సందీప్, మాజీ వీఎస్ఎస్ చైర్మన్ చాకలి సాయిలు, దత్తు, భద్రయ్యతో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.