BREAKING
పేదల జీవితాల్లో ఆసరా పెన్షన్ - లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూర్య 'సీన్' బాక్సాఫీస్ జోరు.. పది రోజుల్లోనే రూ.136.50 కోట్లు దాటి రికార్డు! దుర్గారావు పరామర్శించిన జక్కంపూడి దేశంలో పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం అంగన్వాడి సెంటర్స్ లో పిల్లలకు,ప్లేట్స్ గ్లాసుల పంపిణీ  విడాకులకు ముందు కమల్, సారిక మధ్య ఎంతో లోతైన ప్రేమ ఉండేది.. శ్రుతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత వాయుసేన అమ్ములపొదిలోకి దేశీయ తేజస్ మార్క్-1ఏ చెరువులు కుంటలలో మరమ్మత్తు పనులు చేపట్టాలి బిఆర్‌టి నగర్ 8వ వార్డు అభ్యర్థిగా దొడ్డి నరేంద్ర నామినేషన్. అనకాపల్లి, నవంబర్ 16, మేజర్ బాల్కొండ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం భారత అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర ప్రతి పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది ఆస్కార్ ఎంపిక తర్వాత నిద్రలేని రాత్రులు గడిపాను.. గోంధాల్ దర్శకుడు సంతోష్ దవాఖర్! వరి సాగుకు స్వస్తి.. నీటి పొదుపు పంటలే శ్రేయస్కరం - ఆర్మూర్ మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ వెంకన్న ఆలయానికి కార్తీక శోభ పోటెత్తిన భక్తజనం నిత్య అన్నదాన పథకానికి విరాళం

కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం

Select Suryaa Now
కోటి సోమవారం వేడుకలకు పోటెత్తిన భక్తజనం
సూర్య, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథ సిద్ధులగుట్ట సోమవారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి రావడంతో నిర్వహించిన కోటి సోమవారం పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు సుమారు 15 వేల మందికి పైగా భక్తులు గుట్టపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. శివాలయంలో పంచామృతాలతో, బిల్వపత్రాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. రామాలయం, దుర్గామాత, అయ్యప్ప, ఎల్లమ్మ తల్లి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.కార్తీక మాసం సందర్భంగా భక్తులు ఉసిరికాయ నెయ్యితో తయారు చేసిన వత్తులను వెలిగించి స్వామివారికి సమర్పించారు. ఆలయ అర్చకులకు సంప్రదాయబద్ధంగా వాయనం అందజేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పలు గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం సులభంగా జరిగేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా శ్రీ నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుంచి సిద్ధేశ్వర పల్లకీ సేవను భజన మండలి సభ్యులు భక్తిగీతాలు ఆలపిస్తూ, భజనలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం నిర్ణీత ప్రదేశంలో కొబ్బరికాయ కొట్టి హారతి సమర్పించి తిరిగి రామాలయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మానకొండ రవికుమార్ (జిమ్మి రవి) మాట్లాడుతూ.. శ్రీ నవనాథ సిద్ధులగుట్టకు కోటి సోమవారం సందర్భంగా వేలాదిగా భక్తులు తరలిరావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సిద్ధులగుట్ట ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించేందుకు ఆలయ కమిటీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు సేవా కార్యక్రమాలు అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.భక్తులందరికీ సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి భవాని ట్రేడింగ్ కంపెనీ యజమాని రాజేశ్వర్, వారి కుటుంబ సభ్యులు అన్నదాతలుగా వ్యవహరించారు. ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో భక్తులందరికీ అన్నప్రసాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మానకొండ రవికుమార్ (జిమ్మి రవి), చరణ్ రెడ్డి, అజాజి సతీష్, కొంచెం మంజుల, మురళి, బి. సుమన్, కొడిగెల మల్లయ్య, బట్టు శంకర్, రామాగౌడ్, చక్రవర్తి, పీసీ గంగారెడ్డి, సిద్ధులగుట్ట సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.