సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు పిలుపు
సైదాపురం, మేజర్ న్యూస్ : సైదాపురంమండలంలోని రామసాగరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఎంపీటీసీ అభ్యర్థి పొట్టేల పార్వతికి మద్దతుగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో సుమారు 300 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని గ్రామ పురవీధుల్లో భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ.. రామసాగరం ఎంపీటీసీ అభ్యర్థి పొట్టేల పార్వతికి సైకిల్ గుర్తు రెండో నంబరుపై, జడ్పీటీసీ అభ్యర్థి కిష్టమ్మకు సైకిల్ గుర్తు మొదటి నంబరుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలే తమ పార్టీ విజయానికి బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు సైకిల్ గుర్తును గుర్తుంచుకొని తమ అమూల్యమైన ఓటును వేసి అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్పీ చౌదరి, సుబ్బానాయుడు, భాస్కర్ నాయుడు, మల్లికార్జున్ నాయుడు, గురునాథం, ఆదిశేషయ్య, సుబ్రహ్మణ్యం గౌడ్, అనుకుర్తి శ్రీనివాసులు, ఆళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.