శ్రీశైలం దేవస్థానానికి బంగారు హారం సమర్పణ
శ్రీశైలం దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన సంతోశ్ కుమార్ బంగారు హారం విరాళంగా సమర్పించారు. 28 లక్ష్మీకాసులతో కూడిన బంగారు హారం బరువు 19 గ్రాములు అని దాత పేర్కొన్నారు. ఈ బంగారు హారాన్ని దాత కార్యాలయములో శుక్రవారం ఈవో ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. దేవస్థానం తరఫున దాతను శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాలు అందజేసి సత్కరించారు.