BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ

Select Suryaa Now
శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ
     తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతలు కోరారు.  తిరుపతి జిల్లా డిసిసి అధ్యక్షులు బాల గురవం బాబు ఆధ్వర్యంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంసిద్ధత కొరకు జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ,, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో పోటీకి సిద్ధంగా ఉంటుందని, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించి ఎన్నికలకు సిద్ధం అవ్వాలని నాయకులకు కార్యకర్తలకు సూచనలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సమన్వయకర్త 
తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ,, కాంగ్రెస్ పార్టీని ప్రజలు హక్కున చేర్చుకుంటారని, భారతదేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మెరుగైన జీవనశైలి సాధ్యమవుతుందని, నేడు ప్రతి వ్యవస్థలో నిర్బంధ వైఖరి కొనసాగుతుందని, పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందాలన్న కాంగ్రెస్ పార్టీ రావాలని కోరారు, స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందని వారు తెలిపారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మాంగాటి గోపాల్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, ఓ బి సి కర్ణాటక రాష్ట్ర పరిశీలకులు మురళి, జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త నరసయ్య,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సీతారాం,జిల్లా కలెక్టరేట్ రిప్రజెంటేటివ్ చైర్మన్ చిరంజీవి,జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, మణి, జిల్లా కార్యదర్శి ఇళయరాజా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావణన్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, నాగరాజు, మహేష్, అరుణ్, చరణ్, తదితరులు పాల్గొన్నారు.