శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్ మెడికల్ క్యాంపు - డైరెక్టర్ గుడ్లూరు మయూర్
శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్స్ మెడికల్ క్యాంపు.
శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా ఆదివారం శ్రీకాళహస్తి కొండమిట్ట, వెలమపాలెం పాల డిపో దగ్గర నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపు విజయవంతమైంది. ఈ ఉచిత మెడికల్ క్యాంపు లో శ్రీకాళహస్తి కొండమిట్ట, ఎన్టీఆర్ నగర్, వెలమపాలెం ప్రాంత ప్రజలు దాదాపు 200 మంది పాల్గొన్నారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ఎంజీఎం హాస్పిటల్స్ డాక్టర్ లు డాక్టర్ వివేక్ చైతన్య గుండె వైద్య నిపుణులు, డాక్టర్ ఉమా మహేశ్వర రావు చిన్నపిల్లలు వైద్య నిపుణులు, డాక్టర్ కార్తీక్ ఎముకలు సంబంధిత వైద్య నిపుణులు, డాక్టర్ అర్చన, పంటి సంబంధిత వైద్య నిపుణులు, డాక్టర్ పవన్ పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగానే అందించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం హాస్పటల్స్ డైరెక్టర్, ఇండియన్ రెఫ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ,, ఎంజీఎం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించామని, రాబోయే రోజుల్లో ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంపు లు ఎన్నో నిర్వహిస్తామని శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్స్ లో ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ హెచ్ ఎస్ సేవలు, ఈ ఎస్ ఐ, కార్మిక భీమా సేవలు 24 గంటలు అందుబాటులో వుంటాయని ఈ అవకాశాన్ని శ్రీకాళహస్తి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.