BREAKING
అత్యాధునిక సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా భారత్ ఎదగాలి హెచ్‌ఎంఎస్‌పై విమర్శలు సరికాదు భగవాన్ బిర్సా ముండాకు పార్లమెంట్ ప్రాంగణంలో రాష్ట్రపతి, ప్రధాని మోదీ శ్రద్ధాంజలి తప్పిపోయిన బాలుడును తండ్రి చెంతకు చేర్చిన పోలీసులు ఎస్సై చంద్రశేఖర్ పై ప్రజలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి మందమర్రిలో 17న ఆయుర్వేద వైద్య శిబిరం - ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. తండ్రి జ్ఞాపకార్థం ఆలయాలకు రూ.50 వేల విరాళం అంతర్జాతీయ పరిశోధనలకు భారత్ పెద్దపీట కార్మిక సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యం తగదు - సీఐటీయూ నేత అల్లి రాజేందర్ యువతలో పెరుగుతున్న మధుమేహ ముప్పు ఒడిశా గ్రామీణ ప్రాంతాలకు భారీ వరం 451 మందికి నూతన పింఛన్లు మంజూరు - పింఛన్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భారత్-నేపాల్ మధ్య మరో చారిత్రక మైలురాయి హామీల అమలులో వైఫల్యం.. కక్ష సాధింపులో వేగం! - గడ్డం కుటుంబం తీరుపై బీఆర్ఎస్ నేత మద్ది శంకర్ ధ్వజం భారత్-బెల్జియం మధ్య బలపడుతున్న రక్షణ బంధం వార ఫలాలు | ద్వాదశరాశి ఫలములు | Weekly Horoscope | 15 Nov 2026 - 21 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

సర్పంచ్ పీఠంపై సమరం.. భవిష్యత్తు రాజకీయాలకు సమయం! ఎల్లసిరిలో పల్లెపోరు.. పార్టీల రాజకీయ భవితవ్యానికి పరీక్ష!

Select Suryaa Now
సర్పంచ్ పీఠంపై సమరం.. భవిష్యత్తు రాజకీయాలకు సమయం!  ఎల్లసిరిలో పల్లెపోరు.. పార్టీల రాజకీయ భవితవ్యానికి పరీక్ష!

చిట్టమూరు మేజర్ న్యూస్

 చిట్టమూరు మండలంలోని ఎల్లసిరి పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు రానున్న రోజుల్లో స్థానిక రాజకీయాల దిశను నిర్దేశించే కీలక ఘట్టంగా మారనున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక పాలనకు సంబంధించినవే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎల్లసిరి పంచాయతీ ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.ఈ ఎన్నికల్లో సాధించే విజయం కేవలం సర్పంచ్ పీఠానికే పరిమితం కాకుండా,గ్రామంలో పార్టీకి ఉన్న ప్రజాదరణ,నాయకుల పట్టుదల,కేడర్ బలం,స్థానిక నాయకత్వ సామర్థ్యానికి ఒక కొలమానంగా నిలిచే అవకాశం ఉంది.అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలు తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకం కానున్నాయి.వ్యక్తిగత ఆదరణతో పాటు ప్రజలతో సంబంధాలు, గ్రామాభివృద్ధిపై స్పష్టమైన ఆలోచన, అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అంశాలుగా నిలవనున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థి రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరంగా మారనుంది. సర్పంచ్‌గా ప్రజల మద్దతు పొందిన నాయకుడు భవిష్యత్తు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి.గ్రామస్థాయిలో ఏర్పడే నాయకత్వమే రానున్న రోజుల్లో పార్టీకి బలమైన పునాదిగా మారవచ్చు.అదే సమయంలో ఎన్నికల్లో ఎదురయ్యే ఫలితాలు స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇక్కడ ప్రధానంగా అభ్యర్థి వ్యక్తిత్వం,ప్రజలతో అనుబంధం,గ్రామ సమస్యలపై అవగాహనకు ఓటర్లు ఎంత ప్రాధాన్యత ఇస్తారన్నది,గ్రామాభివృద్ధి,తాగునీరు, పారిశుద్ధ్యం,రహదారులు,మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు సైతం ప్రభావితం చేయనున్నాయి. మొత్తానికి ఎల్లసిరి పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఒక గ్రామానికి నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాకుండా భవిష్యత్తులో చిట్టమూరు మండల, జిల్లాస్థాయి రాజకీయాల్లో నాయకత్వానికి కొత్త రాజకీయ సమీకరణాలకు వేదికగా నిలిచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు అనుసరించే వ్యూహాలు, ప్రజలు ఇచ్చే తీర్పు,విజయం సాధించే నాయకుడి పనితీరు ఎల్లసిరి రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నాయని స్థానికంగా చర్చనీయాంశమైంది.

అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్