BREAKING
బిక్కవోలు జనసేనకు 100% విజయం 400 క్వింటాల సబ్సిడీ సెనగ ఇన్‌స్టాగ్రామ్‌లో మెటా ఏఐ ఏజ్-చెక్: గ్లోబల్ విస్తరణ మహిళా భవన్ నిర్మాణానికి భూమి పూజ. జాతీయ లోక అదాలత్ ను జయప్రదం చేయాలి అండాల సేకరణ అక్రమ దందాపై సర్కారు ఉక్కుపాదం తాగునీటి సరఫరా పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు నజీబ్ రజాక్ గృహ నిర్బంధానికి కోర్టు అనుమతి: మలేషియాలో సంచలనం ప్రవచన మండపం ముందు భవనం ఎత్తు పెంపు కేటీఆర్‌నుమర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్రీనివాస్ రెడ్డి పన్నేండేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి గ్రాండ్ రీఎంట్రీ.. సూర్య సరసన నటించడంపై నజ్రియా ఆసక్తికర వ్యాఖ్యలు! ఓపెన్ఏఐ ఉల్లంఘనపై ఆస్ట్రేలియా కొరడా: ఏఐ కంపెనీలపై కఠిన నిబంధనలు సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలి బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు! ఏడాదిగా అసంపూర్తిగానే రోడ్డు పనులు!

శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

Select Suryaa Now
శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారు బుధవారం శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదిశక్తి స్వరూపిణిగా, దుష్టశక్తుల సంహారిణిగా మహాచండీదేవిని భక్తులు ఆరాధిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహంతో ధైర్యం, శాంతి, శుభాలు కలుగుతాయని విశ్వసిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి, కుటుంబ క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం, లోకకల్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. “ఓం శ్రీ మహాచండికాయై నమః” అంటూ నామస్మరణ చేస్తూ పుష్పార్చన, నైవేద్య సమర్పణ, హారతి కార్యక్రమాలు చేపడుతున్నారు. మహాచండీదేవిని స్తుతిస్తూ “సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే.. శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే” అనే చండీ శ్లోకాన్ని పఠిస్తున్నారు. అలాగే “ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే” అనే చండీ మంత్రాన్ని జపిస్తున్నారు. మహాచండీదేవి ఆరాధన శక్తి, ధైర్యం, ధర్మంపై విశ్వాసాన్ని పెంపొందిస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారి కృపతో ప్రజలందరికీ సుఖశాంతులు, సౌభాగ్యం కలగాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.