నేడు కొందుర్గ్ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
కొందుర్గ్ మండలంలోని వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు గాను షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ బుధవారం కొందుర్గ్ మండలానికి రానున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఉదయం 8:30 కొందుర్గు మండలంలోని పర్వతాపూర్ గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ , మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం,11:00 గంటలకు మండలంలోని బైరంపల్లి గ్రామంలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని,
11:30 గంటలకు కొందుర్గు మండల కేంద్రంలో పరిగి రోడ్డు నుంచి ఎంపీడీవో ఆఫీస్ వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని, 12:00 గంటలకు మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 12:30 కొందుర్గు మండల కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 1:30 గంటలకు కొందుర్గు మండల కేంద్రంలో రఘునాథ్ గౌడ్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని పురుషోత్తం రెడ్డి వివరించారు. ఆయా కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.