BREAKING
దుర్గామాత మండపం వద్ద అన్నదానం నేడు కొందుర్గ్ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ కామెంట్స్.. విజయ్, రష్మికలపై ఆసక్తికర వ్యాఖ్యలు! పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి మార్కెట్ వివరాలు ఇవే! బ్రహ్మగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణ కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ:సర్పంచ్ బాలరాజ్ గౌడ్ నేడు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పర్యటన దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న బిజెపి నేత ఎలిమినేటి నరసింహ రెడ్డి లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు పేర్లు పెట్టడంపై చైనా అభ్యంతరం: భారత సార్వభౌమాధికార నిర్ణయంపై డ్రాగన్ అక్కసు! దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో ఆయుర్వేద వనం :మూలికా వైద్య పరిరక్షణకు భారత్ ముందడుగు విండీస్‌ను కట్టడి చేయడం కాదు, వికెట్లు తీయడమే లక్ష్యం: టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ స్పష్టీకరణ! మహమ్మద్ యూనస్‌ను వేధిస్తే తీవ్ర పరిణామాలు: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి సలహాదారు చట్టపరమైన చర్యల హెచ్చరిక! జమ్మును ముంచెత్తిన రికార్డు స్థాయి వర్షాలు..నివాస ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన బురద, ఇళ్ల శుభ్రతకు స్థానికుల పాట్లు! మాజీ సైనికోద్యోగుల సేవలను వినియోగించుకోవడమే లక్ష్యం: 40 కార్పొరేట్ దిగ్గజాలతో ఆర్మీ ఉన్నతాధికారుల కీలక భేటీ!

అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ:సర్పంచ్ బాలరాజ్ గౌడ్

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ:సర్పంచ్ బాలరాజ్ గౌడ్

మోమిన్ పేట్, మేజర్ న్యూస్: గ్రామంలో రేషన్ కార్డులు లేని అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు చక్రంపల్లి సర్పంచ్ బాలరాజ్ గౌడ్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల పరిధిలోని చక్రంపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విక్రమ్ రెడ్డి, జీపీఓ ప్రభాకర్, ఉప సర్పంచ్ మల్లేశం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాల్ రెడ్డి, ఎం. ప్రవీణ్ కుమార్, జి. నగేష్, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్:వడ్ల మాణిక్యం చారి, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.