BREAKING
దుర్గామాత మండపం వద్ద అన్నదానం నేడు కొందుర్గ్ మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ కామెంట్స్.. విజయ్, రష్మికలపై ఆసక్తికర వ్యాఖ్యలు! పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి మార్కెట్ వివరాలు ఇవే! బ్రహ్మగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణ కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ:సర్పంచ్ బాలరాజ్ గౌడ్ నేడు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పర్యటన దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న బిజెపి నేత ఎలిమినేటి నరసింహ రెడ్డి లడఖ్‌లోని 28 వ్యూహాత్మక ప్రాంతాలకు పేర్లు పెట్టడంపై చైనా అభ్యంతరం: భారత సార్వభౌమాధికార నిర్ణయంపై డ్రాగన్ అక్కసు! దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో ఆయుర్వేద వనం :మూలికా వైద్య పరిరక్షణకు భారత్ ముందడుగు విండీస్‌ను కట్టడి చేయడం కాదు, వికెట్లు తీయడమే లక్ష్యం: టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ స్పష్టీకరణ! మహమ్మద్ యూనస్‌ను వేధిస్తే తీవ్ర పరిణామాలు: బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి సలహాదారు చట్టపరమైన చర్యల హెచ్చరిక! జమ్మును ముంచెత్తిన రికార్డు స్థాయి వర్షాలు..నివాస ప్రాంతాల్లో భారీగా పేరుకుపోయిన బురద, ఇళ్ల శుభ్రతకు స్థానికుల పాట్లు! మాజీ సైనికోద్యోగుల సేవలను వినియోగించుకోవడమే లక్ష్యం: 40 కార్పొరేట్ దిగ్గజాలతో ఆర్మీ ఉన్నతాధికారుల కీలక భేటీ!

కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా

Select Suryaa Now
కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడు రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి మండల ఉపాధ్యక్షుడు సయ్యద్ అజీజ్   రాజీనామా

18 ఏళ్లుగా పనిచేసినా గుర్తింపు లభించలేదని ఆవేదన

 

 కాంగ్రెస్ పార్టీలో గత 18 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కిచెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)కు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, ఐదేళ్లపాటు మండల మైనార్టీ కార్యదర్శిగా, నాలుగేళ్లపాటు మండల మైనార్టీ ఉపాధ్యక్షుడిగా, ఆరేళ్లపాటు మైనార్టీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. పార్టీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలతో పాటు ధర్నాలు, సభలు, ఇతర పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నానని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన క్రమంలో తనపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయని, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పదవుల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపణ
పార్టీ కోసం ఇన్నేళ్లు పనిచేసినా తనకు తగిన పదవి, గుర్తింపు లభించలేదని ఆయన ఆరోపించారు. కొంత మంది నాయకులు తనకు పార్టీ పదవులు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి నాయకుల వరకు తన సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని తెలిపారు.
పార్టీలో నిరంతరం సేవలందించినప్పటికీ గుర్తింపు లభించకపోవడంతో మనస్తాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తన రాజీనామాను ఆమోదించాలని కిచెన్నగారి లక్ష్మారెడ్డిని కోరారు.

టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు