దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న బిజెపి నేత ఎలిమినేటి నరసింహ రెడ్డి
దేవి శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న బీజేపీ నేత ఎలిమినేటి నరసింహరెడ్డి.
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని కమ్మగూడ, ఎన్ఎస్ఆర్ నగర్ కాలనీ , బ్రాహ్మణపల్లిలో దుర్గామాత మండపాల సందర్శన.
* ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి ఎలిమినేటి నరసింహ రెడ్డి ప్రత్యేక పూజలు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఆదిభట్ల సర్కిల్ 53, 56 డివిజనుల బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహరెడ్డి ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్ పరిధిలోని కమ్మగూడ, నీలం సంజీవరెడ్డి నగర్ కాలనీ, బ్రాహ్మణపల్లిలో కొలువుదీరిన దుర్గామాత మండపాలను సందర్శించారు.ఆయా మండపాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు, ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.నవరాత్రి వేడుకల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న భక్తిపూర్వక వాతావరణం, అమ్మవారి మండపాల వద్ద భక్తుల సందడి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో నందగిరి సురేష్ గౌడ్, దార వెంకటేష్, ఎలిమినేటి భరత్ రెడ్డి, వినయ్, దినేష్ గౌడ్,శరత్ తదితరులు పాల్గొన్నారు.
- ఎడ్ల వెంకటేష్ గౌడ్ తుర్కయంజాల్, మేజర్ న్యూస్.