BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

దసరా సెలవులను అమలు చేయాలి : ఎన్‌ఎస్‌యుఐ

Select Suryaa Now
దసరా సెలవులను అమలు చేయాలి : ఎన్‌ఎస్‌యుఐ

ఎన్‌ఎస్‌యుఐ చేవెళ్ల మండల అధ్యక్షుడు ఎండీ సమీరుద్దీన్

చేవెళ్ల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రకటించిన దసరా సెలవులను అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని ఎన్‌ఎస్‌యుఐ చేవెళ్ల మండల అధ్యక్షుడు ఎండీ సమీరుద్దీన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించేందుకు ప్రయత్నించే విద్యాసంస్థలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునే హక్కు ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఎన్‌ఎస్‌యుఐ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

 

(చేవెళ్ల - మేజర్ న్యూస్)