శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం..
అమలాపురం మేజర్ న్యూస్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమలాపురం దేవి మార్కెట్‌లోని శ్రీదేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.లోకానికి అన్నాన్ని ప్రసాదించే అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో సకల జనులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థిస్తున్నారు దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మంగళవారం
శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో 2000 మంది పైబడి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రుల అన్న సమారాధన కమిటీ సభ్యులు సింగంశెట్టి కుమార్, పచ్చిగోళ్ళ సోమరాజు, పచ్చిపులుసు రమేష్, మోటమర్రి కుమార్, పెంజర్ల రంగారావు వారి పూర్తి ధన సహాయముతో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది పట్టణ సీఐ
పి. వీరబాబు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్
ఐ. ప్రేమ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు సాయంత్రం నాలుగు గంటలకు లలితా పారాయణము 6 గంటలకు
శ్రీ లక్ష్మీ వల్లభ భజన మండలి వారిచే కోలాట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.