BREAKING
ఇందిరమ్మ ఇంటి కల సహకారం మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ కమల్ హాసన్‌తో నాటి పుకార్లపై జయసుధ స్పష్టత.. అసలు నిజం బయటపెట్టిన సహజ నటి మహిళా వర్సిటీలో ఘనంగా చిల్డ్రన్స్ డే కొత్త చెరువులో ప్లాస్టిక్ భూతం! గోవా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అరివు చిత్రం ఎంపిక.. ఆసక్తి రేపుతున్న ప్రకటన మహారాష్ట్ర స్టేట్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అజేయంగా నిలిచిన వీర్, హృదయ్ జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారిణి శైలజకు ఘన సన్మానం రామాయణంలో రావణుడిగా యశ్.. ఆ అద్భుత రూపాల వెనుక ఉన్న సానియా సర్ధారియా విశేషాలు దివ్యాంగుల జిల్లాస్థాయి క్రీడా ఎంపికలు అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి.. గొర్రెల చోరీ నిందితుల అరెస్టు... రిమాండ్ కు తరలింపు.... కిసాన్‌ మోర్చా అధ్యక్ష బాధ్యతలు.. కృతజ్ఞతలు తెలిపిన మల్లారెడ్డి మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్ర డానియల్ మాజీ జెడ్పిటిసి సింగం సత్తయ్యను పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ 600 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు

శివకేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం

Select Suryaa Now
శివకేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం

నెల్లూరు కల్చరల్, మేజర్ న్యూస్  :   పరమపవిత్రమైన కార్తీక మాసంలో తొలి సోమవారంతో పాటే నేడు 'కోటి సోమవారం' కలిసిరావడం విశేషంగా మారింది. కార్తీక శుక్ల పక్షంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం, సోమవారం కలయికతో కోటి సోమవారం ఏర్పడుతుందని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు.సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే కోటి సోమవారం నాడు ఆచరించే స్నానం, దానం, జపం, దీపారాధన కోటి రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయని పండితులు వివరిస్తున్నారు. శ్రవణ నక్షత్రం మహావిష్ణువుకు, సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కావడంతో ఈ పర్వదినాన్ని శివకేశవులిద్దరికీ అత్యంత ఇష్టమైన రోజుగా భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
కోటి సోమవారం సందర్భంగా భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కార్తీక స్నానం ఆచరించి, సమీపంలోని శివాలయాలకు వెళ్లి పరమేశ్వరునికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ప్రదోష కాలంలో ఇంట్లోని పూజా మందిరంతో పాటు దేవాలయాల్లో దీపారాధన చేసి, 'ఓం నమఃశివాయ' పంచాక్షరి మంత్రాన్ని జపించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.ఉపవాస దీక్ష చేపట్టే భక్తులు పగలంతా నిరాహారంగా ఉండి, సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి భోజనం చేస్తారు. శక్తి మేరకు ఏకభుక్తం పాటించడం, ఆకాశదీప దర్శనం, దానధర్మాలు చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. కార్తీక తొలి సోమవారం కావడంతో శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.