BREAKING
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ

శివాలయంలో  బారులు తీరిన భక్తులు

Select Suryaa Now
శివాలయంలో  బారులు తీరిన భక్తులు

 

అవనిగడ్డ, మేజర్ న్యూస్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అవనిగడ్డలోని ప్రాచీన శివాలయం గా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖరస్వామి ఆలయంలో   అన్నపూర్ణాదేవి అలంకారంలోని అమ్మవారు దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి భక్తులు బారులు తీరి నిలిచారు.అర్చకుడు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని విశేషంగా అలంకరించగా, ఉభయదాతలు కమ్మిలి రాజా, అనురాధ దంపతులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఘంటసాల రాజశేఖర్(పసి) పర్యవేక్షణలోని పండితుల మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఆలయ కమిటీ చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య), కార్యనిర్వహణ అధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

✍️అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.