సీతమ్స్ లో ఫ్యాకల్టీ డవలప్మెంట్ పై శిక్షణా కార్యక్రమం
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. చిత్తూరు నగరం లోని స్థానిక శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ లో "క్వాంటం కెమికల్ మెథడ్స్ ఫర్ ఎమర్జింగ్ క్వాంటం టెక్నాలజీస్ అండ్ క్వాంటం డాట్ సెల్యులార్ ఆటోమాటా" అనే అంశంపై జరుగుతున్న ఆరు రోజుల ఏఐసిటిఈ అటల్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ బుధవారంతో మూడవ రోజులు విజయవంతంగా పూర్తయింది.ఈ కార్యక్రమం డా. హెచ్. ఉమామహేశ్వరి సమన్వయకర్తగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఉదయం సెషన్‌లో రిసోర్స్ పర్సన్ కార్తి గణేష్ దురై, ఫౌండర్ అండ్ సీఈఓ, క్వాంటమ్‌జి రీసెర్చ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, "క్వాంటం ప్రోగ్రామింగ్ యూజింగ్ ఐ బి ఎం కిస్కిట్" అనే అంశంపై సెషన్ నిర్వహించారు.క్వాంటం ప్యాకేజీలను ఎలా ఇంపోర్ట్ చేయాలి, క్వాంటం సర్క్యూట్‌లను ఎలా నిర్మించాలి, క్వాంటం సర్క్యూట్‌ను ఎలా రన్ చేయాలి మరియు అవుట్‌పుట్‌ను ఎలా అర్థం చేసుకోవాలో ఆయన వివరించారు. క్వాంటం కంప్యూటింగ్‌లో ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌ల ప్రాముఖ్యత గురించి మరియు క్వాంటం సర్క్యూట్‌ను ఎలా డిజైన్ చేయాలో కూడా వివరించారు.మధ్యాహ్నం సెషన్‌లో రిసోర్స్ పర్సన్ అరీష్ పిచ్చై, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్, బెంగళూరు"క్వాంటం సిమ్యులేషన్ ఫర్ మాలిక్యులర్ అన్‌ఫోల్డ్" అనే అంశంపై సెషన్ నిర్వహించారు.ఆయన క్వాంటం అనీలింగ్ మరియు క్వాంటం టన్నెలింగ్ గురించి ప్రదర్శించారు. క్వాంటం కంప్యూటర్ల ప్రమాణాలు, డి వేవ్ 2000 క్యూ క్వాంటం కంప్యూటర్ పరిశోధన అవసరాలు (క్వాడ్రాటిక్ అన్‌కన్‌స్ట్రైన్డ్ బైనరీ ఆప్టిమైజేషన్) గురించి కూడా వివరించారు. ఐ బి ఎం కిస్కిట్ ఉపయోగించి హ్యాండ్స్-ఆన్ ప్రోగ్రామింగ్‌ను అధ్యాపకులు నేర్చుకున్నారు. ఇది తమ సంస్థలలో ప్రాక్టికల్ క్వాంటం కంప్యూటింగ్ ల్యాబ్‌లు కోడింగ్ ఆధారిత అసైన్‌మెంట్‌లను ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది.క్వాంటం సర్క్యూట్‌లను నిర్మించడం, రన్ చేయడం అర్థం చేసుకోవడం గురించిన జ్ఞానం క్వాంటం అల్గారిథమ్‌లను సరళంగా అనువర్తన ఆధారితంగా బోధించడానికి అధ్యాపకులకు వీలు కల్పిస్తుంది.క్వాంటం కంప్యూటింగ్‌లో ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్‌ను అర్థం చేసుకోవడం వల్ల క్వాంటం ఫేజ్ ఎస్టిమేషన్ షోర్స్ అల్గారిథమ్ వంటి అధునాతన భావనలను స్పష్టంగా వివరించడానికి అధ్యాపకులకు సహాయపడుతుంది తెలిపారు.క్వాంటం అనీలింగ్ సంక్లిష్ట ఆప్టిమైజేషన్ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో లా పరిష్కరిస్తుఅధ్యాపకులు తెలుసుకున్నారు. ఇది లాజిస్టిక్స్, ఔషధ ఆవిష్కరణ, ఫైనాన్స్ మెటీరియల్స్ డిజైన్‌లో పరిశోధనకు ఉపయోగపడుతుందని,వాల్‌మార్ట్ నుండి వచ్చిన పరిశ్రమ నిపుణుడి సెషన్ ద్వారా మాలిక్యులర్ మోడలింగ్, ఆప్టిమైజేషన్ సమస్య పరిష్కారం కోసం నిజమైన పరిశ్రమలలో క్వాంటం ఎమ్యులేషన్ ఎలా ఉపయోగించబడుతుందో అధ్యాపకులు తెలిపారు. వివిధ ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.