BREAKING
కంబదూర్ లో పరోక్ష ఎన్నికకు సర్వం సిద్ధం. దేవాంగపురి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఉదయ్ కుమారి అన్నదాతకు సిరులు కురిపిస్తున్న వంకాయ సాగు : మానేవారిపల్లిలో రైతు మధునాయుడు భలే ఆదాయం : పంట దిగుబడి పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి బ్రహ్మసముద్రం మండలం తీట కల్లులో 8కి 8 వార్డులు ఏకగ్రీవం, టిడిపి కైవాసం. అండుకొర్ర విత్తన నమూనాల సేకరణ నార్లపురంలో పొలంబడి పంటను పరిశీలించిన ఆర్గానిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్టీపీసీ బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు! - మూడేళ్లలో రూ.6 కోట్ల దోపిడి - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణలు 11 వ వార్డు లో జోరందుకున్న టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల. నాగమణి ఇంటింటి ప్రచారం కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి... - కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలి - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలకు ICAR గుర్తింపు బంగి నాగేంద్ర కు అనంత డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలి బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం మండలాలను పలు వైఎస్ఆర్సిపి వార్డులు ఏకగ్రీవం. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భద్రత... - నేటి నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు

రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ రాజేష్‌ మృతి : నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు

Select Suryaa Now
రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ రాజేష్‌ మృతి : నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు

మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన పెద్దమండ్యం హెడ్ కానిస్టేబుల్ పొట్టిపాడు రాజేష్ మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు సందర్శించారు.ఈ సందర్భంగా రాజేష్ భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విధి నిర్వహణలో ఉన్న సమయంలో జరిగిన ఈ విషాద ఘటన బాధాకరమని పేర్కొన్నారు.రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని భగవంతుని ప్రార్థించారు.రాజేష్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ,ముద్దుకృష్ణమ నాయుడు,రఘు రాయల్,మల్లెం ప్రకాష్ నాయుడు,ఐటీడీపీ అధ్యక్షుడు కాశీ శ్రీరామ్ వాల్మీకి,మార్కెట్ యార్డు డైరెక్టర్ సుబ్రహ్మణ్యం,సాయి ,శ్రీకాంత్,కేఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి