8 మంది మద్యం బాబులకు రూ.80 వేలు జరిమానా
ట్రాఫిక్ సి ఐ నరసింహ రాజు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడ్డ 8 మంది మద్యం బాబులకు రూ 80 వేల రూపాయల జరిమానా విధించినట్లు చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సి ఐ నరసింహ రాజు తెలిపారు. ఈ మేరకు సీ ఐ బుధవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు, చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో చిత్తూరు నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక నిగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాజాగా నిర్వహించిన వాహన తనిఖీల్లో వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మంది పట్టుపడ్డారని, వారిని చిత్తూరు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పరిమళ దేవి 8 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున మొత్తం రూ.80 వేలు జరిమానా విధించారన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని, దీని వల్ల వాహనదారుల ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.