BREAKING
ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ'.. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్ నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం.. వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు రాజ‌ధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం ఈఠా సినిమా కోసం శ్రద్ధా కపూర్ బరువు పెరుగుదల.. వైభవీ మర్చంట్ ఆసక్తికర వ్యాఖ్యలు శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం

సీతారాంపురం సమగ్ర అభివృద్ధే లక్ష్యం

Select Suryaa Now
సీతారాంపురం సమగ్ర అభివృద్ధే లక్ష్యం

-కూటమి అభ్యర్థి గింజాల బూబయ్యకు మద్దతివ్వండి
- ఎంపీపీ యనమల రాజేష్
తొండంగి, మేజర్ న్యూస్ : సీతారాంపురం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి అభ్యర్థికి ప్రజలంతా అండగా నిలవాలని తొండంగి మండల ఎంపీపీ యనమల రాజేష్ విజ్ఞప్తి చేశారు. తొండంగి మండలం సీతారాంపురం గ్రామ సర్పంచి ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తరఫున బలపరిచిన అభ్యర్థి గింజాల బూబయ్యకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రజలతో మాట్లాడారు.
        ఈ సందర్భంగా ఎంపీపీ యనమల రాజేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి అనేది ఒక్కరి బాధ్యత కాదని, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేసినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటిని దశలవారీగా సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 
        ఈ సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు, కూటమి కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.