BREAKING
ఫ్రైడే డ్రై డే" కార్యక్రమంలో కార్పొరేటర్ కాకి గంగరాజు ఆదివాసీ పిల్లల్లో సహజ క్రీడా నైపుణ్యాలు : ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేష్ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అయ్యప్ప స్వాముల నిత్య అన్నదానానికి ఆర్థిక సాయం - రౌతు భాస్కర్, లంక శ్రీను, ఆసిరినాయుడు *శ్రీరాములపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ పేదకుటుంబాలకు ఆర్థిక భరోసా – ప్రజాసేవే లక్ష్యం* హాకీ ఇండియా లీగ్ 2026–27 జనవరిలో ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం భూముల రి సర్వేకు రైతులు సహకరించాలి...… *హరీశ్ రావు చేతుల మీదుగా టీఆర్ఆర్ఎస్ నాలుగో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ* ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చందర్ రాథోడ్ *మోడల్ స్కూల్ ఆట స్థలాన్ని రక్షించండి జాతీయ రహదారిపై బీజేపీ ధర్నా* పేదల సొంతింటి కలకు సాకారం.. హరీశ్ రావు వ్యాఖ్యలకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ఘాటు కౌంటర్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కర్రసాము అరంగేట్రం.. తెలంగాణ సంప్రదాయ కళకు జాతీయ గుర్తింపు పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు ఆకాశంలో ఒక తార సినిమాపై కేటీఆర్ ప్రశంసలు.. చాలా కాలం తర్వాత అందమైన చిత్రం చూశానంటూ పోస్ట్

శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం

Select Suryaa Now
శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం
  • మహా బిల్వార్చనలో మంత్రి సుభాష్ ప్రత్యేక పూజలు

కాజులూరు, మేజర్ న్యూస్  :

శ్రీ మణికంఠ అన్న సమారాధన సేవా సమితి ఆధ్వర్యంలో, శ్రీను గురుస్వామి నేతృత్వంలో నిర్వహించిన 108 అష్టోత్తర శివలింగ అభిషేకం, మహా బిల్వార్చన మహోత్సవం శివనామస్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్  మేడిశెట్టి శేషారావు, కూటమి పార్టీ  సీనియర్ నేత  వాసంశెట్టి సత్యం పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
శ్రీకాకుళం సూర్యనారాయణ (చిన్ని స్వామి) దంపతులు, చెరుకుపల్లి గణేష్ శర్మ ఆధ్వర్యంలో 108 మంది దంపతులు శివలింగాలకు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, బిల్వార్చన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. సనాతన ధర్మంలో శివారాధనకు విశిష్ట స్థానం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తాయని పేర్కొన్నారు. భక్తి, సేవ, సమాజ శ్రేయస్సు ఆశయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని వాసంశెట్టి సత్యం, మేడిశెట్టి శేషారావు కొనియాడారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. ఈ వేడుకలో గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.