BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

సీనియర్ నటులు గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: మంత్రి కందుల దుర్గేష్

Select Suryaa Now
సీనియర్ నటులు గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: మంత్రి కందుల దుర్గేష్

సూర్య స్టేట్ బ్యూరో.

అమరావతి : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన సహజ, విలక్షణ నటనతో దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు  గిరిబాబు  మృతి చెందడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి  కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సినీ నటులు గిరిబాబు  మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు సినీ రంగంలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, చెరగని గుర్తింపును సంపాదించుకున్నారని కొనియాడారు. దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో వందలాది చిత్రాల్లో ఆయన పోషించిన వైవిధ్యభరితమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయని పేర్కొన్నారు. ప్రతినాయకుడిగా భయపెట్టినా, హాస్యనటుడిగా కడుపుబ్బా నవ్వించినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భావోద్వేగాలను పండించినా.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం గిరిబాబు ప్రత్యేకతని మంత్రి దుర్గేష్ గుర్తుచేసుకున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఎదిగి 600కు పైగా చిత్రాల్లో నటించడం అభినందనీయమని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి దిగ్గజ నటుల నుండి నేటి యువతరం హీరోల వరకు అందరితోనూ కలిసి నటించి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారని మంత్రి గుర్తుచేసుకున్నారు. క్రమశిక్షణ, అంకితభావంతో ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివని, ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహానటుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో గిరిబాబు కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.