సీహెచ్సీపై రైతులకు అవగాహన కల్పించాలి
రామభద్రపురం, సూర్య: జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కస్టమ్ హైరింగ్ సెం టర్లను రైతులు వినియోగించుకోవాలని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి తెలిపారు. మండల వెలుగు కార్యాలయంలో ఆయన రైత ఎలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సీహెచ్సీ ద్వారా రైతులకు వ్యవసాయ యంత్రాల పనిముట్లు అందిస్తున్నామని తెలిపారు. తక ్కువ రేట్లకు అందిస్తున్న ఈ పరికరాల ద్వారా రైతులు ఆర్థిక ప్రయోజనాలు పొందాలని కోరారు. అలాగే డ్వాక్రా మహిళలు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకొని సంఘాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. అలాగే మండల సమాఖ్యకు ఆదాయ అభివృద్ధి మార్గాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్వాక్రా సంఘాలను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ఎంతో చేయూత నిస్తుందని, వీటిని వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు పారదర్శకంగా సేవలందిస్తున్నారని, ఇందులో భాగంగా స్త్రీనిధి అప్పులు తీసుకున్న డ్వాక్రా మహిళలుకు కొత్త యాప్ను ఏర్పాటు చేశామని, దీనిద్వారానే మహిళలు తమ అప్పులు సొంతంగా తీర్చుకోవచ్చునని తెలిపారు. అలాగే రికార్డుల నిర్వహణ, రుణాల రికవరీ తదితర వాటిపై కూడా చర్చించుకోవాలన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా తీసుకున్న రూణాలను యూనిట్లు నెలకొల్పి తద్వారా జీవనోపాధి మెరుగు పరచుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న సీహెచ్ సీ కేంద్రాన్ని పరిశీలించి సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సూరెడ్డి సత్యవతి. సీసీ లు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.