BREAKING
నవంబర్ 27 వరకు సాగునీరు విడుదల చేయాలి ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ 12 ఆదివాసీ గ్రామాలకు రహదారి కష్టాలు - ప్రజావాణిలో దరఖాస్తు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ పాఠశాల శంకుస్థాపనకు హాజరుకానున్న వేం -పాఠశాల పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించిన మండల అధ్యక్షులు యాదవ రెడ్డి వృద్ధులకు రూ.4 వేల టోకరా..ఫించన్ 4వేలకు మరో రూ.2 వేలు ఇస్తామంటూ మోసం వెట్టి చాకిరీ నిర్మూలనే లక్ష్యం.. అవగాహన వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ దీపక్ తివారి నూతన ఎంపీడీవోను సత్కరించిన చల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధికి ఫారం ఫండ్ 31వ వార్డులో ముజామిల్ ప్రచారం జోరు మోర్రపూర్ గ్రామంలో ఫారం ఫండ్ పనులను ప్రారంభించిన సర్పంచ్ 15వ వార్డులో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రజావాణికి మూడు ఫిర్యాదులు 32వ వార్డులో ప్రసాద్ రెడ్డి ప్రచార జోరు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడమే లక్ష్యం..స్వతంత్ర అభ్యర్థి నజీర్ అహ్మద్

రూపురేఖలు మారుస్తా లాంటి బడా హామీ ఇవ్వలేను_ --- చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా ఉంటా ---ఇంటి అనుమతులు పారదర్శకంగా ఉంటాయి ---అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ఒక రూపు తెస్తా ---ఎన్నికల ప్రచారంలో వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్

Select Suryaa Now
రూపురేఖలు మారుస్తా లాంటి బడా హామీ ఇవ్వలేను_   --- చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా ఉంటా   ---ఇంటి అనుమతులు పారదర్శకంగా ఉంటాయి   ---అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థకు ఒక రూపు తెస్తా  ---ఎన్నికల ప్రచారంలో వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్

అనంతపురం బ్యూరో (అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్) : ప్రాథమిక విద్యాభ్యాసం నుండి ఉన్నత చదువుల వరకు ఇక్కడే చదివా! నగర పరిస్థితి అంతా నాకు బాగా తెలుసు.... అనంత రూపురేఖలు మారుస్తా లాంటి బడాబడా హామీలు ఇచ్చి మీ ముందు దోషిగా నిలబడలేను... సామాన్యుడిని నేను... నగరానికి సేవ చేసే భాగ్యం కలిగింది... నన్ను ఆశీర్వదించండి అంటూ ఎన్నికల ప్రచారంలో వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ చేస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది..

రమేష్ చేస్తున్న చిన్న చిన్న వాగ్దానాలు ప్రజలను ఎంతో ఆలోచింప చేసేవిగా ఉన్నాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు... రోడ్డు పక్కన చిరు వ్యాపారులు ఇటు అధికారులతోనూ, అటు స్థానిక నేతల బెదిరింపులతోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... ఆసుపత్రి వద్ద వందల కుటుంబాల చిరు వ్యాపారులు రోడ్డు మీద పడే దుస్థితి ఏర్పడింది... ప్రతి చోటా చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు... ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చిరు వ్యాపారులకు వెన్నుదన్నుగా నిలుస్తానని మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్  ఎన్నికల హామీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది…

     ఇక ఇంటి అనుమతుల విషయం వస్తే రెండు సెంట్లు స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలన్న సవాలక్ష నిబంధనలతో పాటు స్థానిక నేతల, అధికారుల నుండి మామూళ్ల ఒత్తిడి తీవ్రంగా ఉంది.. ఇల్లు కట్టుకోవడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది... వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఇంటి అనుమతుల విషయంలో పారదర్శకతను పాటిస్తానని హామీ ఇవ్వడం వెనుక మతలబు ఇదేనని ప్రజలు చర్చించుకుంటున్నారు... ఈ హామీ సామాన్యులను ఆకట్టుకునే విధంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు…

ఇక నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది.. చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు... కొన్నిచోట్ల మురికి నీరు వెళ్లడానికి వీలు లేక దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.... రమేష్ గౌడ్ డ్రైనేజీ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు నొక్కి చెబుతున్నారు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాంటి అసాధ్యమైన హామీలు ఇవ్వకుండా, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో మెరుగుపరిస్తానని హామీలు ఇస్తుండడంతో ప్రజలు ముఖ్యంగా డ్రైనేజీ బాధిత ప్రజలు రమేష్ గౌడు వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా... ఏది ఏమైనప్పటికీ నవంబర్ 1న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది…

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.