100 ఎకరాల మంచినీటి చెరువులో గల్లంతైన ఇద్దరు యువకులు కన్నీరు మున్నీరు అవుతున్న తల్లి దండ్రులు
పొన్నూరు మేజర్ న్యూస్:- పొన్నూరు పట్టణంలోని టిడ్కో గృహాల సమీపంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మంచినీటి చెరువులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.గల్లంతైన వారిని షేక్ షాజహాన్ (18), షేక్ సత్తార్ (16) గా గుర్తించారు.స్థానికుల కథనం మేరకు ఇద్దరూ చెరువులో ప్రమాదవశాత్తు .వారి ఆచూకీకనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
బాధితుల వివరాలు:
షేక్ షాజహాన్ (18) ఒక ప్రైవేట్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుండగా, షేక్ సత్తార్ (16) పొన్నూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఈ ఘటనతో టిడ్కో గృహాల పరిధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.అర్బన్ పోలీసులు సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై జగన్మోహన్ రావు సంఘటన స్థాలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:- శిలార్