రెట్టింపు నగదు ఇస్తామని మోసం చేసిన 6 గురు అరెస్ట్ ఇంచార్జి డిఎస్పీ పి శ్రీధర్
44.98 లక్షలు నగదు ,కారు ,ప్రింటర్ ,స్టాంపులు రసీదులు స్వాధీనం
కనిగిరి ,మేజర్ న్యూస్ :నెల రోజుల్లో ఒకటికి రెండు రెట్లు నగదు ఇస్తామని చెప్పి డిపాజిట్ల రూపంలో నగదు సేకరించి ప్రజలను మోసం చేసిన చర్చి ఫాస్టర్ మరో 5 మందిని అరెస్టు చేసినట్లు కనిగిరి ఇంచార్జి డిఎస్పీ పి శ్రీధర్ తెలిపారు .ఆదివారం స్థానిక పోలీస్టేషన్ లో విలేఖర్ల సమావేశం నిర్వహించారు .ఈ సంధర్భంగా డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ కనిగిరి పట్టణం లోని రాజీవ్ నగర్ కాలనీలో గల వేద హోసన్న కృప సంస్థ చర్చి ఫాస్టర్ వంగేపురం పురుషోత్తం వారి కుమారులు వంగేపురం సుకుమార్ ,నవీన్ ,దానియేలు ,పురోషోత్తం భార్య నిర్మల ,బంధువు రాంపంగు కాంతమ్మ లు ఎలాంటి అనుమతులు లేకుండా 1000 రూపాయలు కడితే 15 రోజులు నుండి నెల రోజులు లోపు 2000 నగదు రెట్టింపు డబ్బులు ఇస్తామని ప్రజలకు ఆశ కల్పించి స్కీమ్ పెట్టి ప్రజల నుండి డిపాజిట్లు రూపంలో భారీ మొత్తంలో నగదు సేకరించి కుట్ర పూరితంగా మోసం చేసి సొంత అవసరాలకు నగదును వాడుకున్నారు .స్కీమ్ లో నగదు చెల్లించి మోసపోయిన మర్రిపూడి మండలం వేమవరం గ్రామానికి చెందిన గుదే శ్రీనివాసులు కనిగిరి పోలీస్టేషన్ లో పిర్యాదు చేశారు .శ్రీనివాసులు పిర్యాదు మేరకు సీఐ ఉప్పు శ్రీను ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు .పురుషోత్తం వద్ద 13.28 లక్షలు,బ్యాంకు అకౌంట్ లోని 31.70 లక్షలు నగదు ,కారు ,ప్రింటర్ ,స్టాంపులు ,రసీదులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు .ముద్దాయిలను కోర్టులో హాజరు పెడతామని చెప్పారు .కేసు దర్యాప్తు లో చాకచక్యంగా వ్యవరించి ముద్దాయిలను అదుపులోకి తీసుకొని ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్న సీఐ ఉప్పు శ్రీను ,కనిగిరి ,హనుమంతునిపాడు ,పీసీపల్లి ఎస్సై లు జి సందీప్ ,తమ్మిశెట్టి రాజ్ కుమార్ ,బత్తుల నరసింహారావు లను డిఎస్పీ అభినందించారు .