రాయలసీమకు హార్టికల్చర్ హబ్ ఓ గేమ్ చేంజెర్ బీటెక్ రవి
*రాయలసీమకు హార్టికల్చర్ హబ్ ఓ గేమ్ ఛేంజర్ – బీటెక్ రవి*
పులివెందుల మేజర్ న్యూస్:
రాయలసీమను వ్యవసాయ, ఉద్యానవన రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో 'రైజింగ్ రాయలసీమ' కింద హార్టికల్చర్ హబ్ విధానాన్ని వచ్చే నెల 2న మదనపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
కేంద్ర గ్రాంట్లు, ఇతర నిధులతో కలిపి సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలతో రాయలసీమను సస్యశ్యామలం చేసి, పండ్ల తోటలను పెద్దఎత్తున అభివృద్ధి చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి సంఘీభావంగా కడప జిల్లా పులివెందులలో రైతులు దాదాపు 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
గతంలో ఇక్కడి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసినా చేయలేని పనిని, నేడు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కలిసి జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా 299 గ్రామాలకు తాగునీరు అందించి చేసి చూపిస్తున్నారు.
గతంలో పైడిపాలెం, గండికోట ద్వారా చిత్రావతికి కృష్ణా జలాలు తెచ్చి సాగునీరు అందించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడిదే అని పేర్కొన్నారు
లింగాల మండలంతో పాటు ఇతర ప్రాంతాల్లోని అరటి తోటలు ఎండిపోకుండా కలెక్టర్‌తో మాట్లాడి, ఆ రూట్‌లోని చెరువులను నింపుతూ పంటలను కాపాడే చర్యలు తీసుకుంటున్నారు.
1983 నుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గమైనప్పటికీ, సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి వివక్ష లేకుండా పులివెందుల అభివృద్ధికి, తాగునీరు-సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నారు.
రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తమకు ఒక్క అవకాశం ఇస్తే పులివెందులను మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ప్రజలను కోరారు.