BREAKING
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన JBKపురం మాజీ సర్పంచ్ కంచర్ల తిరుపతయ్య ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.. అధికారులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశం మండలంలో జోరందుకున్న నామినేషన్ల పర్వం ఏకగ్రీవం అభివృద్ధికి మార్గం..! చిత్రగుప్త యాప్‌పై అధికారులకు శిక్షణ.. వారం రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.. నవంబర్ 22లోగా వివరాల నమోదు చేయాలి రెండో రోజు నామినేషన్ ల వెలువ నారన్నాయుడు వలస లో 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరిక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి మధుమేహం నివారిద్దాం - ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం విదేశీ ఉద్యోగాలపై నిరుద్యోగ యువతకు బంపర్‌ అవకాశం జర్మనీ, జపాన్, అమెరికా, దుబాయ్‌ సహా పలు దేశాల్లో ఉద్యోగాలు ఈ నెల 20న పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్‌ మేళా శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు రాబోయే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించేందుకు బీసీ దళ్ రెడీ:తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు డి.వి.వి. సత్యనారాయణ గ్రంధాలయ ఉద్యమ నాయకులకు ఘన నివాళులు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించాలి డిసెంబర్ 11 నుంచి 22 వరకు పోటీలు

రాష్ట్రస్థాయి తైక్వాండోలో సూర్య అకాడమీ ప్రభంజనం ఏడు పతకాలతో సత్తాచాటిన క్రీడాకారులు విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేసిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు

Select Suryaa Now
రాష్ట్రస్థాయి తైక్వాండోలో సూర్య అకాడమీ ప్రభంజనం  ఏడు పతకాలతో సత్తాచాటిన క్రీడాకారులు  విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేసిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు

రేపల్లె మేజర్ న్యూస్; తెనాలిలో నిర్వహించిన 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో రేపల్లెకు చెందిన సూర్య తైక్వాండో అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో జరిగిన పోటీల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ మొత్తం ఏడు పతకాలను సాధించి అకాడమీ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటారు.ఈ పోటీల్లో సూర్య తైక్వాండో అకాడమీ క్రీడాకారులు మూడు బంగారు, మూడు వెండి, ఒక కాంస్య పతకంతో కలిపి మొత్తం ఏడు పతకాలు కైవసం చేసుకున్నారు. కొక్కిలిగడ్డ శశికుమార్ బంగారు పతకం సాధించగా, కొక్కిలిగడ్డ అమర్‌నాథ్ మరో బంగారు పతకాన్ని సాధించి ప్రతిభ చాటారు. అదేవిధంగా ఒడుగు సాయికుమార్, కొక్కిలిగడ్డ ప్రవీణ్, చెన్ను వరుణ్ కుమార్ వెండి పతకాలు సాధించారు. పీతా పవన్ సాయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు.అనంతరం విజేతలైన క్రీడాకారులు మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు  మోపిదేవి వెంకటరమణారావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రేపల్లెకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని క్రీడాకారులకు సూచించారు.క్రీడాకారుల విజయానికి కృషి చేసిన అకాడమీ నిర్వాహకులు, శిక్షకులను అభినందించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ రేపల్లె క్రీడాకారులు పతకాలు సాధించి ప్రాంతానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఒకే అకాడమీ నుంచి ఏడుగురు పతకాలు సాధించడం పట్ల క్రీడాభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూర్య తైక్వాండో అకాడమీ సాధించిన ఈ విజయం రేపల్లె ప్రాంతంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.