రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ కుప్పం రాజశేఖర్
అమరావతి, మేజర్‌న్యూస్ :
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో 11వ వార్డులో ఓటుకు రూ.2,000 ఇస్తామంటూ మాట్లాడిన ఆడియోపై విచారణ కోరిన నేతలు. ఆడియో వివరాలు – (వైఎస్సాఆర్సీపీ తరుపున ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఒక్కో ఓటుకు రూ.2000 చొప్పున నాలుగు ఓట్లకు రూ.8000 ఇస్తామని మాట్లాడినట్లు ఆడియోలో వినిపిస్తోంది. అలానే చైర్ పర్సన్ అభ్యర్థిగా ఫాతిమాబీ కౌన్సిలర్ అభ్యర్థిగా నాయక్ పేర్లను ప్రస్తావించారు. ఓటర్లకు 5 కిలోల బియ్యం ప్యాకెట్లు స్వీట్ బ్యాగులు పంపిణీ చేసినట్లు ఇది మూడోసారి రావడమని, సిద్ధార్థ్ రెడ్డి కూడా వచ్చి చెప్పినట్లు సంభాషణలో పేర్కొన్నారు.)
దీనిపై సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నాయకత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వినతిపత్రం ద్వారా కోరడం జరిగింది. 2. చీమకుర్తి 23వ వార్డులో నగదు పంపిణీ ఆరోపణలపై విచారణకు విజ్ఞప్తి
చీమకుర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న అభ్యర్థి సుబ్రమాణ్యం వారితో ఉన్న సురేశ్ రెడ్డి అనే వ్వక్తిని చీమకుర్తి ఇన్ స్పేక్టర్ ఆఫ్ పోలీస్ (CI) దాసరి ప్రసాద్ గుర్తించి అదుపులోకి తీసుకుని వారితో ఉన్న నగదను స్వాధీనం చేసుకొన్నారు. ఈ రకంగా ఓటర్లను ప్రలోభాలు పెడుతున్న వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను టీడీపీ నేతలు ఫిర్యాదు ద్వారా కోరారు.