రాజవొమ్మంగి గ్రామసర్పంచ్ గా దుర్గా ప్రసాద్ ఎన్నిక
రాజవొమ్మంగి, మేజర్ న్యూస్ : మండలంలోని మేజర్ పంచాయతీ రాజవొమ్మంగి గ్రామ సర్పంచ్ గా కనిగిరి దుర్గాప్రసాద్( కత్తెర గుర్తువైసీపీ)827 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. కూటమి బలపర్చిన అభ్యర్థి గొల్లపూడి పెద్దిరాజుపై ( ఉంగరం గుర్తు)విజయం సాధించారు. పంచాయతీలో ఒకటి, రెండు, మూడు, ఐదు, తొమ్మిది, 10, 11, 13, 14 వార్డులలో వైసీపీ మద్దతు అభ్యర్థులు గెలుపొందగా, నాలుగు, ఆరు, ఏడు, ఎనిమిది, 12 వార్డులలో(టీడీపీ ) బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.దూసరపము, చెరువు కొమ్ము పాలెం, శరభవారం, కిర్రాబు, కిండ్ర, తంటికొండ టిడిపి మద్దతు సర్పంచులు, జడ్డంగి,వంచంగి, బడదనాంపల్లి వైసీపీ మద్దతు సర్పంచులు గెలుపొందారు. మిగతా పంచాయతీలు వివరాలు తెలియాల్సి ఉంది.