BREAKING
ఎం ఎస్ సలీం భాష పేరును ఎఫ్ఐఆర్ నుండి తొలగించండి! విలేకరుల సమావేశంలో అంజుమాన్ కమిటీ సభ్యులు! పరిగి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నెల్సన్ దిలీప్‌కుమార్‌తో హృతిక్ రోషన్ క్రేజీ ప్రాజెక్ట్.. బాలీవుడ్‌లో సరికొత్త యాక్షన్ మేజిక్! బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవo: మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి టాలీవుడ్ ఐకానిక్ మాస్ బ్లాక్‌బస్టర్ 'రౌడీ అల్లుడు'కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్ ఘన వేడుకలు! సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన అమీనుద్ధీన్ ఏపీకి వర్షాలు, అల్పపీడన ముప్పు: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎం. అరవింద్ కుమార్ యాదవ్ వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ విజయానికి కృషి చేద్దాం.. - సిపిఐ నాయకులు ఘనంగా...శ్రీ మైసమ్మ తల్లి తెప్పోత్సవం ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి వైష్ణవి చైతన్య రాజ రాజేశ్వరిగా బెజవాడ కనకదుర్గమ్మ పంజాబ్‌లో అమిత్ షా పర్యటన.. సల్మాన్ ఖాన్ బిష్ణోయ్ సమాజానికి క్షమాపణ చెప్పాలి..ప్రముఖ గాయకుడు అనూప్ జలోటా!

రాజ రాజేశ్వరిగా బెజవాడ కనకదుర్గమ్మ

Select Suryaa Now
రాజ రాజేశ్వరిగా బెజవాడ కనకదుర్గమ్మ

విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేడు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా ముగియనున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని జగన్మాత భక్తులకు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అభయప్రదానం చేస్తున్నారు. ఉత్సవాల్లో చివరి రోరైన నేడు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా ఉదయం 10:30 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 1:00 గంటల నుంచి 2:00 గంటల మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఇంద్రకీలాద్రిని సందర్శించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ వేడుకలన్నింటిలోకీ అత్యంత ప్రధానమైన ఘట్టమైన హంసవాహన తెప్పోత్సవాన్ని సాయంత్రం కృష్ణా నదిలో కన్నులపండువగా నిర్వహించనున్నారు. కృష్ణమ్మ ఒడ్డున విద్యుద్దీపాల కాంతుల మధ్య జరిగే ఈ తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.