BREAKING
జ్ఞానాక్షి రాజరాజేశ్వరి వైభవం - బెంగళూరు (జ్ఞానప్రదాయిని రాజరాజేశ్వరి దివ్య చరిత్ర) చక్రయాత్ర - విజయదశమి దర్శనం - 10 రాజరాజేశ్వరీ దేవి - విజయానికి ప్రతీక (శమీ పూజ - పాలపిట్ట - దసరా అంతరార్థం) విజయవాడ నుంచి తిరుపతికి గ్రీన్ కారిడార్‌తో పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రికి గుండె చేరవేత ఎం ఎస్ సలీం భాష పేరును ఎఫ్ఐఆర్ నుండి తొలగించండి! విలేకరుల సమావేశంలో అంజుమాన్ కమిటీ సభ్యులు! పరిగి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నెల్సన్ దిలీప్‌కుమార్‌తో హృతిక్ రోషన్ క్రేజీ ప్రాజెక్ట్.. బాలీవుడ్‌లో సరికొత్త యాక్షన్ మేజిక్! బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవo: మర్రి మమతా రాజశేఖర్ రెడ్డి టాలీవుడ్ ఐకానిక్ మాస్ బ్లాక్‌బస్టర్ 'రౌడీ అల్లుడు'కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్ ఘన వేడుకలు! సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన అమీనుద్ధీన్ ఏపీకి వర్షాలు, అల్పపీడన ముప్పు: శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎం. అరవింద్ కుమార్ యాదవ్ వైసీపీ మేయర్ అభ్యర్థి సి.రమేష్ విజయానికి కృషి చేద్దాం.. - సిపిఐ నాయకులు ఘనంగా...శ్రీ మైసమ్మ తల్లి తెప్పోత్సవం ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటి వైష్ణవి చైతన్య

సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన అమీనుద్ధీన్

Select Suryaa Now
సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపిన అమీనుద్ధీన్

మల్కాజిగిరి,మేజర్ న్యూస్ : మౌలాలి డివిజన్ పరిధిలోని భరత్ నగర్ చౌరస్తాలో బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ , దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఘనంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో బీఆర్ ఎస్ గ్రేటర్ మాజీ కార్యదర్శి అమీను ద్ధీన్ ముఖ్య ఆతిధిగా హజరైనారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి మండపాలను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా అమీనుద్ధీన్ మాట్లాడుతూ,
భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను, మన జీవన విధానాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న 'సంస్కార భారతి' సంస్థను ఆయన అభినందించారు. బతుకమ్మ పండుగ  అంటే నే 'పూలపండుగ'. ఇది మహిళలు అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ ఇది అన్నారు. ప్రకృతిని పూజించి, గౌరవించే ఏకైక దేశం పండుగ బతుకమ్మ పండుగ.  గౌరమ్మ, బోడెమ్మ మొదలుకొని.. తొమ్మిది రోజుల పాటు ఆడ బిడ్డ లందరూ కలిసి మెలిసి బతుకమ్మను ఆడుకుంటూ, చివరకు సద్దుల బతుకమ్మను అత్యంత వైభవంగా జరుపు కోవడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా నికి నిదర్శనమన్నారు.

 

ఒకప్పుడు నిలబడేందుకే వీలు లేని భరత్ నగర్ చౌరస్తాలో నేడు ఘనంగా బతుకమ్మ సంబరాలు,

మౌలాలి ఓల్డ్  సఫిల్ గూడా ప్రాంతంలో చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ ఎస్ ప్రభుత్వానికి ఆనాటి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్ ముంతాజ్ ఫాతిమాకే దక్కుతుందని అమీను ద్ధీన్ అన్నారు. అప్పట్లో భరత్ నగర్ చౌరస్తా పరిసరాలన్నీ చిన్న వర్షం పడితే మూసి నదిని తలపించే విధంగా ఉండేదన్నారు. స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లేవారికి నరకాన్ని చూపించిందని తెలిపారు. అత్యవసర పరి స్థితుల్లో ఈ ప్రాంతానికి.అంబులెన్స్ రావ డానికి కూడా ఎంతో ఇబ్బంది, సమయం పట్టేదన్నారు. అలాంటి దుస్థితి నుంచి ఇక్కడి ప్రజలకు విముక్తి కల్పించిన ఘనత  అప్పటి మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి , బల్దియా శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో అప్పటి కార్పొరేటర్ ముంతాజ్ ఫాతిమా
మౌలాలి భరత్ నగర్ చౌరస్తాలో భారీ కల్వర్టు నిర్మించి, డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించి, పై నుండి ఎంతో నాణ్యతను గల రోడ్డును  వేయించిందని అమీనుద్ధీన్ తెలిపారు. వారానికో సారి జరిగే వారంతపు సంత ఇక్కడ నిర్వహించే వారని, చిన్న వర్షం పడి సంతకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారి సమీపా నున్న  కాలువలో కొట్టుకోని పోయి మృతి చెందడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన తాను, కార్పొరేటర్ ముంతాజ్ ఫాతిమా ఇద్దరం ఈ సమస్యను కేటీఆర్ దృష్టికి తీసు కుని వెళ్లి పరిష్కరించడం జరిగిందన్నారు. దాదాపు పది కోట్లు రూపాయుల నిధులు తీసుకుని వచ్చి  భరత్ నగర్ చౌరస్తా అభివృ ద్ధి చేశామని తెలిపారు. అదే విధంగా పరిసర ప్రాంతాలైన మొగుల్ కాలనీ, లక్ష్మీనగర్, సాయినాథపురం , ప్రగతి నగర్ ప్రాంతాల నుండి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి  వరద, డ్రైనేజీ నీరు ఎక్కడా ఆగకుండా పక్కా ప్రణాళికతో నాలా అభివృద్ధి పనులు చేయించామని చెప్పారు.అదే విధంగా సుధా నగర్ మెర్సీ మోడల్ స్కూల్ వద్ద కల్వర్టు నిర్మించి,మారుతి నగర్ నుండి భరత్ నగర్ వరకు డ్రైనేజ్ వ్యవస్థను పునర్నిర్మించి వర్షపు ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బంది పడ కుండా చేశామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ  ఆడబిడ్డలందరికీ ఆయన బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
నవరాత్రులలో దుర్గామాతను ప్రతిష్టించు కోవడం అనేది అన్యాయంపై ధర్మం సాధించి న విజయానికి ప్రతీక అన్నారు. స్త్రీలను పూజించి, గౌరవించే గొప్ప సంప్రదాయం మన తెలంగాణలోనే ఉందన్నారు. శక్తి స్వరూపిణి అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో భక్తిశ్రద్ధలతో పూజి స్తారని తెలిపారు. పండగలను అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని, మౌలాలి డివిజన్ ప్రజలు అందరూ సుఖసంతోషా లతో ఉండాలని అమీనుద్ధీన్ ఆకాంక్షించారు.