పరిగి నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి
పరిగి, మేజర్ న్యూస్: పరిగి నియోజక వర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి విజయదశమి ( దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయ దశమి పండుగ నాడు, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రారంభించిన ప్రతి పనిలో విజయం పొందాలని, ఆ భగవంతుణ్ణి కోరారు. చెడు పైన మంచిని సాధించిన సందర్బంగా,విజయానికి సాంకేతంగా జరుపుకునే దసరా పండుగను ' అలై బలైతో ' ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.